Breaking News

మ్యారిసన్ రవీంద్రనాథ్ ఠాగూర్ జూనియర్ కళాశాలలో 72వ గణతంత్ర వేడుకలు

తెలుగు తేజం, వత్సవాయి : వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో మ్యారిసన్ రవీంద్రనాథ్ ఠాగూర్ జూనియర్ కళాశాల నందు 72వ గణతంత్ర వేడుకలును మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కళాశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థిని విద్యార్థులకు గణతంత్రం దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన చైర్మన్ యన్ అశోక్, కరస్పాండెంట్ కే భరద్వాజ, ప్రిన్సిపాల్ కే సుధాకర్ లు మాట్లాడుతూ భారత చరిత్రలో అతి ముఖ్యమైన రోజు ఇది. 200 ఏళ్లు తెల్లదొరల పాలనలో మగ్గిన భారతావనికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం లభించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటివరకు మన దేశంలో బ్రిటీష్ రాజ్యంగమే అమల్లో ఉండేది. దాని ప్రకారమే కొన్నాళ్లు మన పాలన సాగింది. స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం అవసరమని నిర్ణయించారు. ఈ సందర్భంగా 1947, ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు.1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఇది 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మన స్వాతంత్ర్య భారతం.. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రోజునే మనం ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ ఈ రోజును గొప్ప రోజుగా భావిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంలో చైర్మన్ యన్ అశోక్, కరస్పాండెంట్ కే భరద్వాజ, ప్రిన్సిపాల్ కే సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ కే క్రాంతి కుమార్ మరియు అధ్యాపక బృందం కిరణ్ కుమార్, వాసు, విజయలక్ష్మి, అనూష, శైలజ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *