తెలుగు తేజం, జగ్గయ్యపేట : ధర్మవరప్పాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల లో జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య చిత్ర పటానికి ప్రధానోపాధ్యాయులు లాహోరి. హనుమంతు పూల మాల వేసినారు. ఈ సందర్భంగా విద్యార్థులు ను ఉద్దేశించి మాట్లాడుతూ రెపరెపలాడే మన త్రివర్ణ పతాకం చూస్తే దేశభక్తి ఉప్పొంగుతుంది .సమైక్యతారాగం నినదిస్తుంది.స్వాతంత్ర్య ఉద్యమంలో ఎన్నో మహోన్నత ఘట్టాలకు ప్రతీకగా నిలిచిన మువ్వన్నెల జాతీయ జెండా రూపుదిద్దుకొని వందేళ్ళు నేటికి పూర్తి అయింది అన్నారు .జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలిసిన అవసరం ఉంది అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ,విద్యార్థులు జాతీయ పతాకాలు చేత పట్టుకోని పింగళి వెంకయ్య చిత్ర పటానికి నమస్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ లాహోరి. హనుమంతు ,ఉపాధ్యాయులు పర్చా. లక్ష్మణరావు ,ఉపాధ్యాయినులు సునీత ,కుమారి ,మంగతాయమ్మ ,సుజాత మరియు డాక్టర్ కొఠారి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ శేఖర్ బాబు చాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు..