తెలుగు తేజం, కంచికచర్ల : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పరిధిలో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో నందిగామ రూరల్ సీఐ సతీష్ మరియు కంచికచర్ల ఎస్సై ఎం పి ఎస్ ఎస్ రంగనాథ్ తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని అవగాహన కల్పించారు. త్రిబుల్ రైడ్ చేస్తున్న ద్విచక్ర వాహనదారులను అనుమతి పత్రాలు సరిగా లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి అపరాధ రుసుము భారీగా విధించారు.మునుముందు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని రహదారి నియమాలు పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని సిఐ కే సతీష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఎస్ ఎస్ రంగనాథ్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.