Breaking News

డాక్టర్ రమణ మరియు సునీల్ కు సత్కారం

తెలుగు తేజం : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నకు చెందిన కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగములకు చెందిన ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ మండూరి వెంకటరమణ కు సామాజిక సేవా విభాగం లో చేసిన సేవలకు గుర్తింపుగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వారు శ్రీకాళహస్తి లో జరిగిన కార్యక్రమంలో శివ నంది పురస్కారము అలాగే సునీల్ కు ఫోటోగ్రఫీ విభాగంలో ప్రతిభకు గుర్తింపుగా శివ నంది పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ చేతులమీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గజల్స్ మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు మరింత సామాజిక బాధ్యతతో సమాజ అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాళహస్తి గుడి ఈవో పెద్దిరాజు సీఐ నాగార్జున రెడ్డి, ఫోరం అధ్యక్షులు డాక్టర్ కృష్ణ బట్టు, డాక్టర్ కోలా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *