తెలుగు తేజం, కంచికచర్ల : పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభించారని కంచికచర్ల మండలం. మహిళ మండల సమైఖ్య అధ్యక్షరాలు జ్యోతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ‘వైఎస్సార్ బీమా పథకం’ ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేరుకుంతుందని. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని, కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేసినట్టు ఆమె తెలిపారు.
నిరుపేదల కోసం వైఎస్సార్ బీమా పథకం తెచ్చాం. రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుంది. ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిచారు. ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్ గ్రామ వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తారు. వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయం ద్వారం వైఎస్ఆర్ బీమా చేపట్టడం జరుగుతుంది. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తారు.18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వారు వైయస్సార్ బీమా మీరు నమోదు చేసుకున్నారు లేదో తెలుసుకోవాలంటే యొక్క గ్రామ సచివాలయం లో సమాచారం తెలుస్తుంది.