డ్రగ్స్ కేసులో టీడీపీ మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు చిత్తూరు జిల్లా టీడీపీ నేత డీకే.శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. ఎన్సీబీ అధికారులు బెంగళూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.డ్రగ్స్ వ్యాపారితో శ్రీనివాస్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో ఎన్సీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, డ్రగ్స్ కేసులో డీకే శ్రీనివాస్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
ఆంధ్రప్రదేశ్-చిత్తూరుకు చెందిన డీకే శ్రీనివాస్.. బెంగళూరు కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కుటుంబంతో కలిసి బెంగళూరులోనే ఉంటోన్న డీకే శ్రీనివాస్‌కు డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో అదుపులోకి తీసుకున్నారు ఎన్సీబీ అధికారులు. ఏపీ, కర్నాటకలోని సినీ రాజకీయ ప్రముఖులకు డీకే శ్రీనివాసులునాయుడు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్తో ఆయన నివాసాల్లో సోదాలు చేసింది ఎన్సీబీ. డీకే శ్రీనివాస్ హౌస్‌తోపాటు పలువురు ప్రముఖుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో డీకే శ్రీనివాస్ నివాసంలో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తోంది. బెంగళూరులో బిగ్ బిజినెస్‌మెన్‌గా ఉన్న డీకే శ్రీనివాసులునాయుడు.. మాదక ద్రవ్యాల సరఫరా కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
డీకేతోపాటు ఓ కన్నడ సినీ నటుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలు పెట్టుకున్న డీకే శ్రీనివాస్.. ఏపీ, కర్నాటకలోని సినీ రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు NCB అనుమానిస్తోంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ సీక్రెట్‌గా ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు. డీకే శ్రీనివాస్‌తోపాటు అతనితో సన్నిహిత సంబంధాలున్న సినీ రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లోనూ NCB సోదాలు చేసింది. ఈ కేసులో మరింత ఇన్ఫర్మేషన్ సేకరించేందుకు డీకే శ్రీనివాస్ కస్టడీ కోసం ప్రయత్నిస్తోంది NCB.డీకే ఇంటరాగేషన్ తర్వాతే బెంగళూరు డ్రగ్స్ గుట్టు వీడనుంది.