పెళ్లి ఇంట విషాద చాయలు
తెలుగుతేజం, కంచికచర్ల:
కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు అనారోగ్య సమస్యతో ఆదివారం మృతి చెందాడు. తాపీ పని చేసుకుని జీవనం కొనసాగించే శ్రీనివాసరావుకి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకి ఈనెల 11వ తేదీ వివాహం జరిగింది. నిన్న 16 రోజులు పండగ. ఈ క్రమంలో శ్రీనివాసరావు మృతి చెందడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా తన తండ్రికి కర్మకాండలో తానే నిర్వహిస్తానని ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుమార్తె స్పందన ముందుకు రావడంతో కుటుంబ సభ్యులు దగ్గరుండి ఆమెచేత కర్మకాండలు జరిపించారు.