తెలుగు తేజం, జగ్గయ్యపేట రూరల్ మండలంలోని తిరుమలగిరి గ్రామములొ వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క హుండీలను బుధవారం ఉదయం 10 గంటలకు షేర్ మొహమ్మద్ పేట గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి హరి దుర్గ నాగేశ్వర రావు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఎస్ చంద్రశేఖర్ మరియు ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ కాకనబోయిన నరసింహారావు మరియు సభ్యులు సమక్ష్యములో బౌతిక దూరం పాటిస్తూ మాస్కులు దరించి సానిటైజర్ వినియోగిస్తూ హుండీలను తెరిచి లెక్కించారు. శ్రీ స్వామి వారి దేవస్తానము యొక్క ఆరు హుండీల ద్వారా రూ.18,02,375/-లు మరియు శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్తానము యొక్క 2 హుండీల ద్వారా రూ.25,844/-లు వెరసి రూ.18,28,219/-లు ఆదాయము 82 రోజులకు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఎస్ చంద్ర శేఖర్ తెలియజేసారు.ఈ హుండీల లెక్కింపు కార్యక్రమములో పరిటాల శ్రీ సాయి సేవ సమితి వారు పాల్గొన్నారు.