తెలుగు తేజం,కర్నూలు: కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించిన తుంగ, భద్ర నదులు.. వేర్వేరుగా ప్రవహించి.. కూడ్లి అనే పట్టణంలో.. తుంగభద్రగా ఆవిర్భవించిన అనంతరం కర్నూలు జిల్లాలో ప్రవేశించి.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలిసిపోతుంది. కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందిస్తుంది. నవంబరు 20వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటా 21 నిమిషాలకు.. బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా.. తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతాయి. గతంలో 2008 డిసెంబర్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా కర్నాటకలో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. అప్పట్లో కర్నూలు జిల్లాలో సుమారు 50 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.