అమరావతి, తెలుగుతేజం ప్రత్యేక ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ బిసి రాష్ట్ర విభాగం, సాధికార కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ ఎ కన్వెన్షన్ లో వేలాది మంది తో జరిగిన సభకు హాజరైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన పార్టీ అధినేత చంద్రబాబు
సభలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం
• తెలుగు దేశం పార్టీకి వెన్నెముక వెనుక బడిన వర్గాలు
• టిడిపి ఇంత బలంగా ఉండడానికి కారణం బిసి వర్గాలు
• బిసిలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది ఎన్టీఆర్
• బిసిల ఘనత తెలుగు దేశం ముందు…తెలుగు దేశం తరువాత అని చూడాల్సి ఉంది.
• బిసిలను అంతకుముందు ఓటు బ్యాంకుగా చూశారు….పదవులు కూడా ఇవ్వలేదు.
• ఎన్టీఆర్ వచ్చిన తరువాత బిసిలకు రాజ్యాధికారం సాధ్యం అయ్యింది.
• తెలుగు దేశం పార్టీ వచ్చిన తరువాత బిసి లనుంచి నాయకత్వాన్ని పెంచాం
• అధికారంలో బిసిలను భాగస్వాములను చేశాం…దీంతో బిసి వర్గాలు శక్తివంతమైన వర్గాలు అయ్యారు.
• బిసిల నాయకత్వం పెంచడం కోసం స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు పెట్టారు.
• ఎన్టీఆర్ 24 శాతం చేస్తే….నేను దాన్ని 34 శాతానికి పెంచాను.
• జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రిజర్వేషన్లను పది శాతం తగ్గాయి.
• జగన్ కారణంగా 16 వేల మంది బిసి సోదరులు పదవులకు దూరం అయ్యారు.
• టిడిపి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు….వైసిపి ఎందుకు అమలు చెయ్యలేకపోయింది.
• కేంద్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి పదవి వస్తే దాన్ని ఎర్రం నాయుడు కు ఇచ్చాం
• రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నత శాఖలు అన్ని బిసిలకు ఇచ్చాం.
• అధికారంలో భాగస్వాములు చేశాం…..బలోపేతం చేశాం.
• ఎవరెన్ని మాటలు చెప్పినా బిసిలు ఎప్పుడూ టిడిపి తోనే ఉన్నారు.
• మూడున్నరేళ్ల జగన్ పాలన తరువాత 90 శాతం బిసిలు మళ్లీ టిడిపి వైపు వచ్చారు.
• బిసిలను ఆర్థికంగా పైకి తేవాలని నేను ఆలోచించాను.
• బిసిల్లో 142 వర్గాలు ఉన్నాయి…..వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టాను.
• మరుతున్న కాలంతో చేతి వృత్తులు మూలన పడ్డాయి.
• దీంతో కుల వృత్తి లో ఉన్నవారికి ఆదరణ కింద ఆధునిక పరికరాలు ఇచ్చాము.
• బిసి లకు సబ్ ప్లాన్ తెచ్చిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం
• జగన్ ఏర్పాటు చేసిన 54 కార్పొరేషన్ లు ఏం చేస్తున్నాయి.
• కార్పొరేషన్ ల ద్వారా ఒక్కరికి అయినా సాయం చేశారా
• రాష్ట్రంలో బాదుడే బాదుడుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
• బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ ఎక్కువ అయ్యింది.
• ఎప్పుడో ఒక సారి జగన్ పొట్ట పగిలి అన్ని డబ్బులు బయటకు వస్తాయి.
• ఆరోజు మధ్యపాన నిషేధం అన్నారు….
• జగన్ ఎట్ట పుట్టాడో తెలీదు గాని…..ఏ లగ్నంలో పుట్టాడో గానీ నోరెత్తితే జగన్ అబద్దాలే
• అసెంబ్లీలో అన్ని విషయాల్లో జగన్ అబద్దాలే.
• మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా మెడికల్ యూనివర్సిటీ తెచ్చింది ఎన్టీఆర్
• ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి…వైఎస్ఆర్ పేరు పెడతారా
• ఎన్టీఆర్ పేరు మార్పు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీయడమే.
• దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత ఇచ్చింది నేను.
• జగన్ అబద్దం చెపితే కనీసం అతికేటట్లు చెప్పాలి.
• నేను అనుకుని ఉంటే కడపకు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా.
• హర్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు ఉండేదా
• పేరుమార్పుతో నీచ బుద్ది బయట పడింది….జగన్ హూందా తన పెరగలేదు.
• జగన్ చేతగాని దద్దమ్మ కబుర్లు చెపుతూ నన్ను విమర్శిస్తున్నాడు.
• కడపలో స్టీల్ ప్లాంట్ కట్టి నీ తండ్రి పేరు పెట్టు కో
• కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి నీ తండ్రి పేరు పెట్టుకో
• రాష్ట్రంలో తట్ట మట్టివెయ్యలేదు….ఇప్పుడు స్టిక్కర్ సిఎం పేర్లుమారుస్తున్నాడు
• 24 ఏళ్ల క్రితం పెట్టిన పేరును ఇప్పుడు జగన్ తొలగిస్తాడా
• జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్ వంటి వారి పేర్లుపెట్టి సంస్థలు నిర్మించాం.
• మళ్లీ అధికారంలోకి వస్తాం….అప్పుడు జగన్ రెడ్డి కథ చెపుతాం.
• సిఎం నిర్ణయాన్ని తీవ్రంగా కట్టిస్తున్నా….తప్పని ప్రతి ఇంటికి దీన్ని చేరవేద్దాం.
• మళ్లీ ఎన్టీఆర్ పేరు వర్సిటీకి పెట్టే వరకు నిద్రపోయేది లేదు.
• ఎన్టీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం.
• పేద పిల్లల కోసం గురుకుల పాఠశాలలు పెట్టాం.
• 25 ఇంజనీరింగ్ కాలేజ్ లు ఉంటే వాటిని 250 చేశాం.
• విద్య తో నే మార్పు అని విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం
• జిల్లా కు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిన ఘనత టిడిపిదే.
• వెనుక బడిన వర్గాల కోసం విదేశీ విద్యకు 10 లక్షల సాయం చేశాం.
• ఆదరణ పథకం కింద 90 శాతం సబ్సిడీ ఇచ్చాం
• ఐటికి ప్రాధాన్యత ఇస్తే నాపై విమర్శలు చేశారు.
• ఇప్పుడు ఆ ఐటి తోనే యువత జీవితాల్లో పెనుమార్పులు
• విజన్ 2020 గురించి విమర్శలు చేశారు…కానీ ఇప్పుడు అదే నిజం అయ్యింది.
• కళ్లుండి చూడలేని కబోదులు ఈ వైసిపి నేతలు
• డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇస్తే కూడా విమర్శలు చేశారు…ఇప్పుడు కిరాణా కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్
• అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్ ఉంది …కానీ జగన్ మద్యం షాపులో మాత్రం లేదు.
• నేను టెలీకమ్యునికేషన్ డీ రెగ్యులేషన్ పై వాజ్ పేయికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్ చడ్డీలు వేసుకుని తిరుగుతుండేవాడు.
• నేను ఇచ్చిన ఐటీ ఉద్యోగం మరిచిపోయి…మద్య షాపు, వాలంటీర్ ఉద్యోగం గురించి ఆలోచిస్తే ఎలా.
• రాష్ట్రంలో పరిశ్రమలు పారిపోయాయి..ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు.
• రాష్ట్రానికి మంచి అవకాశాలు ఉన్న సమయంలో వైసిపి పాలనతో నష్టం
• జగన్ తుగ్లక్ పాలనకు ఇక ఇటు ఎవరూ రారు.
• మన పిల్లల భవిష్యత్ కోసం తెలుగు దేశం పార్టీ మళ్లీ రావాలి.
• రౌడీలు, దొంగలు, బందిపోట్ల నమోనానే ఈ జగన్ రెడ్డి
• ఇలాంటి వారి గుండెల్లో నిద్రపోయే శక్తి టిడిపికి ఉంది.
• నాకు కులం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బలహీనవర్గాలే నాకులం.
• అమరావతి, పోలవరం అనేది మన కోసం రూపకల్పన చేశాం
• తెలుగు దేశాన్ని గెలిపించండి……తిరిగి మీ రుణం తీర్చుకుంటా.
• నాకు అత్యంత ప్రీతి పాత్రమైన వర్గం బిసి వర్గం
• నన్ను గెలిపించింది…ఎక్కువ ఆదరించింది బిసిలే.
• వైసిపి రాష్ట్రానికి చీడపురుగు.
• నాకు ఒక్క అవకాశం ఇవ్వండి…తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి.
• మా ఊర్లో రోడ్లు లేకపోతే..వాగులు వంకల్లో తిరిగి చదువుకున్నాను.
• అలాంటి రోజుల నుంచి మనం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం.
• ఎన్టీఆర్ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే…..నేను ఆత్మవిశ్వాసం గురించి చెప్పాను.
• కొల్లు రవీంద్ర పై చాలా బాధ్యత ఉందని కమిటీ నియామకం చెప్పినప్పుడే చెప్పాను.
• బిసిలను అందరినీ ఒకే తాటిపైకి తేవాలి. బిసిలకు మనం రుణ పడి ఉన్నాం.
• బిసిలలో నాయకత్వం తయారుకావాలి. 142 కులాల నుంచి నాయకత్వం కోసం సాధికార కమిటీలు పెట్టాం.
• సాథికార కమిటీల ద్వారా లక్ష మందికి పదవులు ఇస్తాం….
• జగన్ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా నేను సిద్దంగా ఉన్నాం.
• సిఎం జగన్ భయపడుతున్నాడు కాబట్టే జగన్ కు అసహనం…అసెంబ్లీలో కూడా అది జగన్‌లో కనిపించింది.
• వైసిపి నాయకులు ఇప్పుడు పిల్లులు అయ్యారు.
• జగన్ కు మనస్సాక్షి లేదు…నీతి, నిజాయితీ లేదు. జగన్ ఒక అబద్దాల కోరు.
• హైకోర్టుకు వెళ్లే రోడ్డు లో లైట్లు లేవని హైకోర్టు లో కేసు వేయాల్సి వచ్చింది
• సిఎం జగన్ ఈ పరిస్థితికి సిగ్గు పడాలి.
• అదే సుపరిపాలనకు….వైసిపి విద్వంస పాలన ఉన్న వ్యత్యాసం.
• కుప్పంలో 70 మందిపై కేసులు పెడితే ఏమవుతుంది…చరిత్ర హీనుడిగా జగన్ మిగిలిపోతాడు.
• జగన్ నంగి నంగి గా మాట్లాడుతాడు…..కమలహాసన్ ను మించిన నటన జగన్ లో ఉంది.
•నాయీ బ్రాహ్మణులు, రజకులు లకు గ్రూప్ లోన్ లు తీసేసారు.
• 20 లక్షల మంది మత్యకారులు ఉంటే లక్ష మందికే సాయం
• చేనేతల సబ్సిడీ కి కోతలు పెట్టారు.
• బీసీ మాజీ మంత్రుల పై అక్రమ కేసులు పెట్టారు.
• బాబాయ్ ను చంపిన నీకు ఏ శిక్ష వెయ్యాలి.
• 39 మందిని రాజకీయ హత్యలు చేస్తే…26 మంది బీసీలు
•పల్నాడులో హత్యలతో బీసీలను చంపేస్తున్నారు.
•బీసీ లు అంటే అంత అలుసు అయ్యిందా?