అమరావతి: దీపావళి పండుగ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్లు, జిల్లా ఎస్పీలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది బాణాసంచా తయారు చేసే, విక్రయించే దుకాణదారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా టపాసులు విక్రయిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసులు సూచించిన నిబంధనలను పాటించాలి. పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ కమీషనర్లకు, జిల్లా ఎస్పీలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. గోదావరి జిల్లాలో మందుగుండు సామాగ్రి తయారీ, స్టోరేజ్ గోదాంలో అమ్మకాలు జరిగే ప్రదేశాలపై ఇప్పటికే ప్రత్యేకమైన నిఘా పెట్టామని డీజీపీ చెప్పారు.