Breaking News

ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి సేవలు వెలకట్టలేనిది

తెలుగు తేజం విలేఖరి (బంటుమిల్లి) : ఆయుర్వేద వైద్య పితామహుడు ధన్వంతరి సేవలు వెలకట్టలేని వని బంటుమిల్లి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ధన్వంతరి జయంతిని స్థానిక గంగానమ్మ ఆలయం వద్ద ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘ నాయకులు ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బంటుమిల్లి చిన్న పాండ్రక ఆసుపత్రులలో డాక్టర్లు చేజర్ల సౌందర్య, ఎస్ లావణ్య చేతుల మీదుగా రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. సంఘ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని సందర్భంగా సంఘ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మాటూరి కుమార్, దేవరపల్లి శ్రీను, మేడూరి సాయి, జంపన సాయి, ముత్యాలపల్లి దుర్గారావు, దాలిపర్తి బాబి మరియు సంఘ నాయకులు తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *