తెలుగు తేజం, నందిగామ : నందిగామలోని చెరువుకట్ట బజార్ నందు కల ఎల్-షద్ధాయి ప్రార్ధనా మందిరమునందు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కృష్ణాజిల్లా ప్రార్థనా విభాగపు అధ్యక్షురాలు మేరీ లక్ష్మీ అధ్యక్షతన ” దేశం కొరకు ప్రార్థన “అనే సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మట్టా ప్రసాద్ మాట్లాడుతూ ” భారత దేశము వివిధ మతాల కులాల వర్ణాల జాతుల సమాహారం అని, ప్రతి క్రైస్తవుడు విధిగా దేశం కొరకు ప్రార్ధించాలని దేశ క్షేమమే క్రైస్తవుని ఊపిరిగా ఉండాలని సూచించారు”.రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జార్జి ముల్లర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కొరకు,దేశ ప్రధాని,క్యాబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ప్రార్థించాలని సూచించారు. ఈ సమావేశంలో కోస్టల్ రీజియన్ కోఆర్డినేటర్ పాల్ శంకర రెడ్డి,పొలిటికల్ వింగ్ జిల్లా అధ్యక్షులు మార్కపూడి ప్రసాదు, రాష్ట్ర నాయకులు జస్వంత్ రాణి, రాజేశ్వరి,సుజాత, కృష్ణా జిల్లా అధ్యక్షులు హానోకు, జిల్లా ఉపాధ్యక్షులు రాంబాబు, నెహెమ్యా,బెంజిమెన్,సుభాషిని జిల్లాలోని పలు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.