తెలుగు తేజం, నందిగామ : కృష్ణజిల్లా నందిగామ 32 జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల లో భాగంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు డి ఎస్ పి నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో లో సిఐ కనకారావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు నందిగామ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ సెంటర్ వరకు వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా సిఐ కనకారావు మాట్లాడుతూ యాక్సిడెంట్ అంటే కారు బైక్ గుద్దుకొని రోడ్డు మీద పడటం కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుందని కారు కాని బైక్ నడిపే టప్పుడు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా పిల్లలకు బైక్ కొని ఇచ్చేటప్పుడు వారు మేజర్ అయ్యాక ఇవ్వండి వారికి పూర్తిగా డ్రైవింగ్ వచ్చాక లైసెన్స్ ఇప్పించి బైక్ కొనుగోలు చేసి ఇవ్వండి. డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్ హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదికి వచ్చి బైక్ నడపండి మీ ప్రాణాలను రక్షణ కల్పించు కోండి అని ఆయన అన్నారు