Breaking News

నయా డాన్ గుప్పిట్లో గుట్కా

కంచికచర్ల పట్టణంలో పురివిప్పిన గుట్కా మాఫియా..
కంచికచర్ల పట్టణం వేదికగా వీరులపాడు మండలంలో పలు గ్రామాలకు గుట్కా రవాణా చేస్తున్న ప్రబుద్ధుడు..
గతంలో ప్రైవేటు పాఠశాల మాస్టారు.. ఇప్పుడు నిషేధిత గుట్కా వ్యాపారంలో స్టారు …
గమ్యం మార్చి, కొత్త సామ్రాజ్యం వైపు నడిచి, ప్రస్తుతం గుట్కా వ్యాపారంలో ఆరితేరాడు
.
.

కంచికచర్ల తెలుగు తేజం: కంచికచర్లలో గత కొన్నేళ్లుగా గుట్కా వ్యాపారంలో రారాజుగా వెలుగొందిన వ్యక్తులను పోలీసులు ఉక్కు పాదంతో అణచివేయడమే కాకుండా తిరిగి ఈ చీకటి వ్యాపారం కూకటివేళ్లతో పెళ్ళగించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పీడి యాక్టు నమోదు చేయించి  గుట్కా వ్యాపారం వైపు కన్నెత్తి చూడకుండా చేయడంలో కాస్త సఫలమయ్యారు కానీ అది కూడా మూడు నాళ్ళ ముచ్చట గానే మారింది కంచికచర్ల ప్రాంతంలో అడపాదడపా గుట్కా రవాణా నడుస్తూనే ఉంది.  కొత్తగా పుట్టుకొచ్చిన నందిగామ మండలానికి చెందిన వ్యక్తి కొత్త గా గుట్కా వ్యాపారి  వ్యాపారిగా  అవతారమెత్తి  గత వ్యాపారులను  మించిన స్థాయిలో కంచికచర్ల మరియు వీరులపాడు మండలాలలో తన సామ్రాజ్యాన్ని విస్తరించే దిశగా ముందుకు వెళుతున్నాడు. కంచికచర్ల పట్టణంలో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటూ తన కార్లలో గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనేలా కొనసాగిస్తున్నాడు.కంచికచర్ల ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని వీరులపాడు, ఇబ్రహీంపట్నం మండలాలకు రాత్రి సమయాల్లో కారులో నిషేధిత గుట్కాలు చేరవేస్తూ అంచెలంచెలుగా తన గుట్కా సామ్రాజ్యం విస్తరింప చేస్తున్నాడు. ఇటీవల  ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటైన తర్వాత అక్రమ మద్యం రవాణా పై పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు భారీ స్థాయిలో మద్యం సీసాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అదునుగా ఈ వ్యాపారి మరింత రెచ్చిపోయి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నా డు కంచికచర్ల ప్రాంతంలో జరుగుతున్న గుట్కా వ్యాపారం పై పోలీసులు కన్నెత్తి చూడటంలేదు. నందిగామ మండలం నుండి వచ్చిన ఈ గుట్కా వ్యాపారి గతంలో ఒక ప్రైవేటు స్కూల్ నందు విద్యార్థులను తీర్చిదిద్దే గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిని చేసి తదుపరి అక్రమార్జన కోసం వక్ర మార్గంలో అడుగు పెట్టాడు. బడ్డీ కొట్లు,పాన్ షాపుల వద్ద ఐదు పది గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న చిన్నచిన్న వ్యాపారులపై కాక నిఘా కళ్ళకు చిక్కకుండా పోలీసులకు చేతికి దొరకకుండా ఈ వ్యాపారం చేస్తున్న చేస్తున్న ఇటువంటి అక్రమార్కుల చీకటి వ్యాపారాన్ని వీలైనంత త్వరగా అణిచివేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *