తెలుగు తేజం, విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మవారి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ నవరాత్రుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్గగుడిలో నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని , దర్శనానికి వచ్చేవారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. శివాలయం కూడా నిర్మాణం పూర్తి అయిందని. ఈ నవరాత్రుల్లో దర్శనాలకు అనుమతిస్తామని పైలా స్వామి నాయుడు తెలిపారు. దసరాకు 74వేల టికెట్లు ఆన్లైన్లో బుక్ అయ్యాయన్నారు. మూల నక్షత్రం రోజున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలుసమర్పిస్తారని వెల్లడించారు . అనంతరం దేవాలయ కార్యనిర్వాహణాధికారి సురేష్ బాబు మాట్లాడుతూ ఈ నవరాత్రులు ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రావడంతో దుర్గ గుడి దగ్గర ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తగ్గుతాయని, 17 నుండి మొదలయ్యే ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని దర్శనానికి వచ్చే భక్తుల ను ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంత్రం 3 నుంచి 5 వరకు అనుమతిస్తామని తెలిపారు. వీఐపీలు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవావాలన్నారు. టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనానికి రావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లో పైలా సోమినాయుడు, కార్యనిర్వాహణాధికారి సురేష్ బాబు , ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు