తెలుగు తేజం, రాజమండ్రి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల కల్లా ఆయన అంతర్వేదికి చేరుకోనున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. స్వామి వారి దర్శనం అనంతరం నూతన రథాన్ని ప్రారంభించనున్నారు. గత యేడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయం తెలిసిందే. దీంతో 95 లక్షల రూపాయలతో 41 అడుగుల ఎత్తులో ఉన్న రథాన్ని ప్రభుత్వం తయారు చేయించింది. మరోవైపు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అంతర్వేదిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.