తెలుగు తేజం పెనుగంచిప్రోలు: కలలు కనండి వాటిని నిజం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటల స్ఫూర్తితో తమ లక్ష్యం దిశగా అడుగులు ముందుకు వేస్తూ , తన తల్లిదండ్రుల ఆశయ సాధనకు , ఎన్ని అవకతవకలు వచ్చిననూ కష్టాలు ఎదురైనా తను కన్న కలలు నిజం చేస్తూ తనకు అత్యంత ఇష్టమైన పోలీస్ శాఖ లో ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగం సాధించాడు జి రామకృష్ణ ఉద్యోగ ప్రస్థానం మొదలైంది ఇలా.. 2014లో మైలవరం మండలంలోని పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా చార్జి తీసుకుని తన విధి నిర్వహణలో ప్రజా మన్ననలతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందాడు. ముదినేపల్లి, గుడివాడ స్టేషన్ల తన విధి నిర్వహణలో ఎలాంటి బేషజాలు లేకుండా సమర్థవంతమైన అధికారిగా ఖ్యా తి దక్కించుకున్నారు. ప్రస్తుతం పెనుగంచిప్రోలు సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ పోలీస్ అనే గర్వం లేకుండా తన పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజల మాన ప్రాణ ధన రక్షణకే తన ధ్యేయంగా పని చేస్తున్నారు. రామకృష్ణ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ, నేరస్తుల పాలిట సింహస్వప్నంగా గా నిలిచాడు యువ సబ్ ఇన్ స్పెక్టర్ గా పెనుగంచిప్రోలు మండల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నేరాలకు పాల్పడిన వారిలో సైతం సత్ ప్రవర్తన కలిగే విధంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ అనేక మందిలో మార్పు మార్పు తీసుకు వస్తూ తనదైన శైలిలో సామాజిక బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి రామకృష్ణ మాట్లాడుతూ పెనుగంచిప్రోలు లో ఈ సంవత్సరం నుండి తన విధి నిర్వహణలో సహకరిస్తున్న ప్రజలకు, ఉన్నతాధికారులకు కృతజ్ఞుడనై ఉంటాను అన్నారు.