తెలుగు తేజం : నవరత్నాలు – పేదలందరికి ఇళ్ల పట్టాలు కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి గ్రామంలో ఇళ్ల పట్టాల పండుగ వేడుక సోమవారం అంగరంగ వైభవం గా జరిగింది. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ,మేకతోటి సుచరిత , పెర్ని వెంకట్రామయ్య (నాని) , కోడాలి వెంకటేశ్వరరావు (నాని) , వెల్లంపల్లి శ్రీనివాసరావు , పార్లమెంట్ సభ్యులు సహచర శాసనసభ్యులు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 3539 మంది పేదలకు ఇళ్ల పట్టాల పండుగ వేడుక జరిగింది. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం , మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అద్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు పార్లమెంట్ సభ్యులు సహచర శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఏడాదిన్నర పాలనలో సంక్షేమ పథకాల ద్వార 93 వేల కోట్ల రూపాయల డబ్బులను బటన్ నోక్కి అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు.పేదల ఇళ్ల స్థలాల కోసం 9 వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం జరిగిందన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండి అశీర్వదించాలని కోరారు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరాంని మైలవరం శాసనసభ్యుల వసంత కృష్ణ ప్రసాదుని ప్రతేకంగా అభినందించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధులు గా వచ్చిన మంత్రులు చేతుల మీదగా ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు.అనంతరం అతిథులకు మెమోంటో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి పార్టీ నాయకులు ,అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.