Breaking News

తెలుగువాడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రాముడు : మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

తెలుగు తేజం, నందిగామ : తెలుగువాడి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానేత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రాముడు అని నందిగామ మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని పురస్కరించుకొని కంచికచర్ల మండల టిడిపి పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు ఆధ్వర్యంలో 25వ వర్ధంతి వేడుకలు సోమవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తొలుత కాకతీయ యూత్ ఆధ్వర్యంలో స్థానిక చెవిటికల్లు సెంటర్ నందు గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రాముడి తెలుగువాడి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేయడమే కాక ఆయన ముఖ్యమంత్రిగా పదవి అలంకరించి ఆడపిల్లలకు ఆస్తి హక్కు వంటి సంస్కరణలు తీసుకు వచ్చారని అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు అన్న ఎన్టీఆర్ అని రాజకీయాలు ఎవరి సొత్తు కాదని నిరూపించారని ఆమె అన్నారు దేశంలో అత్యుత్తమంగా సంక్షేమ పథకాలు పునాది వేసి రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పేదవాడికి పక్కా గృహం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని కొనియాడారు ఆనాడు రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వారి ఆధీనంలో ఉన్న బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్రాన్ని అందించిన ఘనత నందమూరి తారక రాముడు అని అన్నారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు రక్తదానం చేసిన 120 పైగా కార్యకర్తలను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమ వెంకట్రావు కంచికచెర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నన్నపనేని లక్ష్మీనారాయణ కొమ్మినేని నరసయ్య అన్నదాత రామకృష్ణ కంచికచర్ల జడ్పిటిసి అభ్యర్థిని గొర్రెపాటి వజ్రమ్మ మాజీ వైస్ ఎంపీపీ అల్లాడి కోటేశ్వరరావు మాగంటి బాబు మాగంటి పుల్లారావు షేక్ అలీ పాషా దిలావర్ హజరత్ గుత్తా రత్నం మాజీ వార్డు మెంబర్ శేషం వెంకటేశ్వరావు గుదే నరేష్ గోగినేని అమర్నాథ్ గుత్తా ఓంకార్ జంపని ప్రసాద్ దివ్వెల కోటేశ్వరరావు చాప మోహన్ సుధాకర్ నాయక్ రొంపిచర్ల శ్యామ్ యాదాల శ్రీను వనపర్తి వెంకటేశ్వరరావు బండ్ల నరేంద్ర షేక్ జానీ శేషం ప్రభాకర్ కనకరత్నం నగర గంటి ఏసోబు సీతారాములు లు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *