తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును శాసనసభ్యులు డా. మొండితోక జగన్ మోహన్ రావు శుక్రవారం పత్తి నిల్వలను పరిశీలించారు. ముందుగా మార్కెట్ యార్డ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, అధికారులు, సిబ్బంది కూడా అందుకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించిన ఏ ఒక్క అధికారి, సిబ్బందిని కూడా ఉపేక్షించేది లేదని , మార్కెట్ యార్డులో జరిగే ప్రతి కొనుగోలు, అమ్మకాల వివరాలను ,రికార్డులను తనకు ప్రతిరోజు పంపాలని , నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులపై ఇకనుంచి తానే పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తానని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శనివారం నుండి మార్కెట్ యార్డులో కొత్త బయ్యర్ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తారని, యార్డులో నిల్వ ఉన్న అన్ని పత్తి బోరాలు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.