జగ్గయ్యపేట రూరల్ (తెలుగుతేజం) మండలంలోని తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్తానము నందు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహనధికారి ఎస్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 .30 గంటలకు చివరి రోజు పవిత్రోస్తావలు జరిగాయి. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను
శ్రీ స్వామి వారికి తులసిదళాలు అందజేసారు.
అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము జరిగింది. తదుపరి శ్రీ స్వామి వారికి లక్ష తులసి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమములో 50 మంది ఋత్వికులు, యాగ్నిక బ్రహ్మ శ్రీ పరాంకుసం వాసుదేవాచార్యులు వారు మరియు ఆలయ ప్రధాన అర్చకుల శ్రీ తిరునగరి రామకృష్ణమాచార్యులు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. నేటితో పవిత్రోత్సవములు పూర్తి అయివున్నవని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహనధికారి ఎస్ చంద్ర శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కాకనబోయిన నరసింహారావు మరియు సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.