పంచాయతీకార్యదర్శి కనగాల రవికుమార్, కంచికచర్లప్రెస్,క్లబ్,వ్యవస్థాపకఅధ్యక్షుడుగంగిరెడ్డి. రంగారావు లు పేర్కొన్నారు.
తెలుగు తేజం, కంచికచర్ల : నూతనసంవత్సరం,క్రిస్మస్ పర్వదినాలనుపురస్కరించుకుని కంచికచర్ల పంచాయతీ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి స్థానిక పాత్రికేయులు ప్రెస్ క్లబ్ సభ్యులు నన్నపనేని వెంకట దుర్గా రావు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగాపంచాయతీ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ సభ్యులు లoకోజి నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన కార్యక్రమంలో రవికుమార్, రంగారావులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించినవేళ ప్రజలను అంటు వ్యాధుల బారిన పడకుండా గ్రామాలను పరిశుభ్రం చేసిన పారిశుద్ధ్యసిబ్బంది సేవలు మరపురాని అని కొనియాడారు. విందులు, వినోదాలు, పెళ్ళిళ్ళు, పుట్టినరోజుల సందర్భంగా ఆర్భాటాలకు చేసే ఖర్చుల్లో కొంత మిగిల్చి, పేద కార్మికులకు సాయం చేస్తేవారిజీవితాల్లోవెలుగులు నింపిన వారవుతారని అన్నారు. నన్నపనేని దుర్గారావు అమెరికాలో ఉన్న తన కుమార్తె శ్రీ తేజ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య, కార్మికులకు నూతనవస్త్రాలు విందు భోజనాలు ఏర్పాటుచేయడం ఆనవాయితీఅని, కరోనాదెబ్బకు విలవిలలాడుతున్న కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా నూతనవస్త్రాలు, మిఠాయిలు పంపిణీచేయటం అభినందించ దగ్గవిషయం అన్నారు. ఇదేస్ఫూర్తితో సమాజంలోని ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతిఒక్కరూముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలోపంచాయతీసిబ్బందివెల్లంకి.రామారావు, భూషణం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.