తెలుగు తేజం, మచిలీపట్నం : కృష్ణా జిల్లా ఎస్ పి ఎం రవీంద్రనాథ్ బాబు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎల్లప్పుడూ పోలీస్స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఏ ప్రాంతాల్లో విధులు నిర్వహించేది అక్కడ ఏటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, డి ఎస్ పి రమేష్ రెడ్డి తో కలిసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు, వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్లో కు వచ్చే బాధ్యతల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని మహిళలు చిన్నారులు ఫిర్యాదులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సై రాజేష్ కి సూచించారు.