* ఆధునాతన నిర్మాణాలతో ఆధునీకరణ
*ప్రత్యేకంగా లోకాయుక్త ఏర్పాటు కోసమే మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు
*ఇంతలోనే విజయవాడ వద్దని కర్నూలు తరలించాలని ముమ్మరంగా ఏర్పాట్లు
* ప్రభుత్వ శాఖల మధ్య లోపించిన సమన్వయం
*ప్రభుత్వంలో ఒక శాఖ కి మరో శాఖ కి మధ్య సమన్వయం లేక కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇందుకు తాజా ఉదాహరణ విజయవాడ నగరంలో బందర్ రోడ్ లో ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగా ఉన్న రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన, ఓ పెద్ద భవనంలో వేలాది చదరపు అడుగులు చెందిన ఓ ప్రాంతంలో మున్సిపల్ శాఖ దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేకంగా లోకాయుక్త ఏర్పాటు నిమిత్తమై ఆధునీకరణ పనులు చేపట్టారు.
కోట్ల రూపాయల ఆధునీకరణ పనులు జరిగిన తరువాత ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన,
ఈ ప్రాంతాన్ని పక్కనపెట్టి కర్నూలు, నగరంలో లోకాయుక్త ఏర్పాటు చేయాలి స్థల సేకరణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
వేల చదరపు అడుగుల, సువిశాల ప్రాంగణంలో, చూడముచ్చటగా, ఎంతో అందంగా, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో, మున్సిపల్ శాఖ, కోట్ల రూపాయల పనులు చేపట్టిన తరువాత, కర్నూలు కు లోకాయుక్త తరలించడం అనేది ప్రశ్నార్థకంగా మారిందని, ఇప్పుడు న్యాయకోవిదుల తో పాటు ప్రజలలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున, అటు శ్రీకాకుళం, విశాఖపట్నం,ఇటు తిరుపతి, కర్నూలు, రాయలసీమ అదేవిధంగా అన్ని ప్రాంతాల వారికి మధ్యే మార్గంగా విజయవాడ, నగరంలో ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాకె కసరత్తు చేసి ఆధునీకరణ పనులు చేసిన తర్వాత, తాజాగా ఇప్పుడు కర్నూలు,కు తీసుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, భావన ప్రజల నుండి వ్యక్తమవుతోంది.
ప్రజలు పన్నుల రూపేణా చెల్లించిన నగదు తోనే ప్రభుత్వం పని చేస్తుంది, మునిసిపల్ శాఖ ఈ విధంగా వ్యవహరించడంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదిఏమైనా మునిసిపల్ శాఖ ఇకపై పోరుకు పలువురు సమాయత్తం సమాయత్తమవుతున్న ట్లు న్యాయకోవిదులు లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తులు, ఈ వ్యవహారంపై ఒక సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.