పెనమలూరు : ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం అని పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. బుధవారం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని ఐదవ వార్డు నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ (నాని), వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.