Breaking News

తిరుమలలో చిక్కిన 5వ చిరుతపులి..

తిరుపతి : తిరుమల అలిపిరి నడక దారిలో 5వ చిరుతపులి బోనులో చిక్కింది. నరసింహ స్వామి ఆలయానికి దగ్గర్లో 7వ మైలు మధ్యలో ఈ చిరుత బోనులోకి వచ్చి, బంధీ అయ్యింది. ఈ చిరుత కోసం వారం నుంచి అధికారులు వెతుకుతున్నారు. ఐతే.. ఇది అక్కడక్కడే తిరుగుతోంది తప్ప.. బోనులోకి రాలేదు. ఐతే.. దీని కదలికలను ట్రాప్ కెమెరాలతో గమనిస్తూ వచ్చారు. చివరకు ఇది మొత్తానికి బోనులో చిక్కింది. ఐతే.. ఇక్కడితో ఆపరేషన్ చిరుత ముగిసిపోలేదు. కంటిన్యూ చేస్తామని అటవీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ చిరుతలో భాగంగా.. ఇప్పటివరకూ 5 చిరుతపులులను బంధించారు. ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి చెయ్యడంతో.. ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. అంతకుముందు మరో బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. ఆ చిరుతను అప్పుడే పట్టుకున్నారు. ఐతే.. చిన్నారి మృతితో… అప్రమత్తమైన టీటీడీ, అటవీ అధికారులు.. నడకదారిలో తిరిగే చిరుతల్ని పట్టుకోవడానికి ఆపరేషన్ చిరుతను ప్రారంభించారు. ఆగస్టు 14, 17, 27 తేదీల్లో రెండు చిరుతలు బోనుల్లో చిక్కాయి. ఇప్పుడు సెప్టెంబర్ 6న 5వ చిరుత చిక్కినట్లైంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *