Breaking News

ఒక యూనిట్‌.. జేబు ఖాళీ చేస్తుంది!

విజయవాడ : టీవీ ఆన్‌లోనే ఉంచి ఇంట్లో పనులు చేస్తుంటారు..
ఫ్యాన్‌, లైట్‌ వేసి మరిచిపోయి పట్టించుకోరు… బెడ్‌రూంలో ఏసీ ఆన్‌లోనే ఉంటుంది.. ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యం జేబును ఖాళీ చేస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు. ఇందులో ఒక యూనిట్‌ దాటితే బిల్లుల్లో రూ.వందల్లో తేడా వస్తుంది. విద్యుత్తు పొదుపుగా వాడుకుంటే రూ.200 నుంచి రూ.300లోపే చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఒక ఫ్యాన్‌, రెండు లైట్లు, టీవీ వినియోగిస్తూ 50 యూనిట్ల లోపు వాడుకుంటే యూనిట్‌ ఛార్జీ రూ.1.95తో రూ.100 వరకు బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అదనపు ఛార్జీలు కొద్దిమొత్తంలో కలుస్తాయి. 100 లోపు యూనిట్లకు రూ.3.10 కాగా 100 యూనిట్లు దాటితే రూ.3.40కి లెక్కిస్తారు. అంటే 0 నుంచి 100కుపైన యూనిట్లకు మొత్తం రూ.3.40 గానే లెక్కిస్తారు. మధ్యతరగతి కుటుంబం 190 యూనిట్లు వాడితే రూ.640 బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అదనపు ఛార్జీలు అదనంగా కలుస్తాయి. 101 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు 0 నుంచి 200 వరకు ఒకే స్లాబ్‌లో రూ.4.80గా లెక్కిస్తారు. అదే 200 యూనిట్లు దాటి ఒక యూనిట్‌ పెరిగిన రూ.5.10న లెక్కిస్తారు. 201 నుంచి 300 వరకు రూ.7.70, 301 నుంచి 400 వరకు రూ.9.00గా లెక్కిస్తారు. 401 నుంచి 800 వరకు రూ.9.50గా లెక్కిస్తారు. 800కుపైగా ఎన్ని యూనిట్లు కాలిన రూ.10గా లెక్కిస్తారు. విద్యుత్తు బిల్లుల్లో అవగాహన లేక పొదుపు పాటించక జేబుకు చిల్లు పడుతోంది. 100 యూనిట్ల లోపు వాడే వారి సంఖ్య 20 శాతం మేర ఉండగా 200 నుంచి 250 యూనిట్లు వాడే వారి సంఖ్య 50 శాతానికి పైగా ఉంది. 250 యూనిట్లలోపు వారు పొదుపు పాటిస్తే ప్రతి నెల రూ.200 నుంచి రూ.300 వరకు తేడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 100 యూనిట్లలోపు వాడే వారు 110, 120 యూనిట్లు వాడగా స్లాబ్‌ రేట్‌ మారిపోయి అదనపు భారం పడుతోంది. 100 యూనిట్లలోపు రూ.3.10గా 100 యూనిట్లు దాటితే రూ.3.40గా లెక్కిస్తారు. ప్రతి నెల 120 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తుండగా రూ.400కు పైగా బిల్లు వస్తుంది. పొదుపు చేసి 100 యూనిట్ల లోపు వినియోగిస్తే మొదటి స్లాబ్‌లో రూ.300 లోపు బిల్లు వస్తుంది. 20 యూనిట్లు పొదుపు చేస్తే రూ.100 బిల్లు తగ్గించుకోవచ్చు. ఇంట్లో టీవీ, ఫ్రీజ్‌, గ్రైండర్‌, బోరు మోటారు, ఫ్యాను ఉండగా 220 నుంచి 230 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. దీనికి స్లాబ్‌ రేట్‌ ప్రకారం యూనిట్‌ రూ.5.10గా లెక్కిస్తారు. అదే 200 లోపు యూనిట్లు వాడితే రూ.3.40గా లెక్కిస్తారు. అంటే 20 నుంచి 30 యూనిట్లు పొదుపు చేస్తే బిల్లు తగ్గించుకోవచ్చు. రూ.1200 నుంచి రూ.1250 వచ్చే బిల్లు 200 యూనిట్ల లోపు వాడితే రూ.900 లోపు వచ్చే అవకాశం ఉంది.
పొదుపు సూచనలు.
విద్యుత్ అధికారుల సూచనలు

ఎల్‌ఈడీ బల్బులే వాడాలి. అదికూడా 10 వాట్స్‌లోపు ఉంటే మేలు అవసరం మేరకే టీవీ, ఫ్యాన్లు, లైట్లు వాడుకోవాలి.
ఐఎస్‌ఐ కంపెనీ ఫ్యాన్లు, కూలర్లు, బోరు మోటారు, గ్రైండర్‌ వాడాలి. ఏసీ 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాడుకుంటే బిల్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. అది కూడా 3 స్టార్‌, 5 స్టార్‌ ఉన్న ఏసీలు, ఫ్రిజ్‌లు కొనుగోలు చేయాలి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *