ఇబ్రహీంపట్నం (తెలుగు తేజం ప్రతినిధి) :పేదవాడి ఆకలి తీర్చడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న “ప్రధానమంత్రి గరిబ్ కళ్యాణ్ అన్న యోజన” పథకం ఏ విధంగా అమలు జరుగుతుందో పరిశీలించుటకు కృష్ణా కృష్ణాజిల్లా మోర్చా ఆధ్వర్యంలో పర్యటనలు కొనసాగుతున్నాయి దానిలో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం ,గొల్లపూడి,ఈలప్రోలు గ్రామాలు పర్యటించటమైనది, ఈ సందర్భంగా కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు రేగళ్ళ రఘునాథ రెడ్డి మాట్లాడుతూ తూ ప్రధాని మోడీ అమలు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని అది ఇది సమర్థవంతంగా అమలు అమలు తీరుతెన్నులను పర్యవేక్షించడానికి జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ కూనల యుగంధర్ ,జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జి మారాసు కృష్ణమోహన్ ఇబ్రహీంపట్నం మండల కిసాన్ మోర్చ అధ్యక్షులు కరణం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.