తెలుగు తేజం, నందిగామ : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ వీరులపాడు ఎస్ ఐ ఎస్సై హరి ప్రసాద్ వారి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్రం దెందుకూరు వైపు నుంచి 26 వేల రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేధిత గుట్కా రెండు కేజీల గంజాయి తరలిస్తున్న రెండు బైకులను ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నందిగామ రూరల్ సీఐ సతీష్ మాట్లాడుతూ వీరులపాడు మండలం లో పెద్దాపురం గూడెం మాధవరం జయంతి గ్రామాల వద్ద అలాగే కంచికచర్ల మండలం లోని దొన బండ పోలీస్ అవుట్ చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యం రవాణా జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం నిషేధిత గుట్కా, గంజాయి ఇసుక తదితర అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.