సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు -1 సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు , ఎమ్మెల్యే ఆర్కే, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అందించడంలో రాజకీయాలు, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా.. అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నర సంవత్సరాలు కాలవ్యవధిలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99.5 శాతం వాగ్దానాలు నెరవేర్చడం జరిగిందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికోసం గ్రామ వాలంటీర్లు, గ్రామ, వార్డు, నగరపాలక సంస్థ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.ఈ గ్రామంలో 1748 గృహాలు ఉంటే 814 వినతులు వచ్చాయని కేవలం రెండు వినతులు మాత్రమే తిరస్కరించబడినవని, వారికి కూడా సహేతుకమైన వివరణతోపాటు ధ్రువీకరణ పత్రాలు అందించడానికి సాధ్య సాధ్యాలను పరిశీలించాలని సూచించడం జరిగిందన్నారు.ఆత్మకూరు గ్రామంలో ప్రభుత్వ సంక్షేమం కోసం రూ 17 కోట్లు, అభివృద్ధి పనుల కోసం 20 కోట్లు ఖర్చు చేశామని.. ఎక్కడ అవినీతి, లంచాలకు తావు లేకుండా అభివృద్ధే ధ్యేయంగా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, స్మశాన వాటికలు అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. కేవలం 1748 ఇండ్లు ఉన్న ఈ ప్రాంతానికి రూ. సుమారు 37 కోట్లు ఖర్చు చేయడం అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయాలని, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అందరూ అండగా నిలబడాలని కోరారు.ముందుగా పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు, నగరపాలక సంస్థ అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.