ప్రతినిధుల సభకు అమీ బెరా, రో ఖన్నా ఎన్నిక
ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి కూడాడెమోక్రాటిక్ పార్టీ తరపున విజయంగెలుపు బాటలో మరో భారతీయ అమెరికన్
వాషింగ్టన్ : గత ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రతినిధుల సభకు ఎన్నికైన నలుగురు భారతీయ అమెరికన్లు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి భారీ ఆధిక్యంతో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కృష్ణమూర్తి నెలకొల్పిన ‘సమోసా కాకస్’ సభ్యులైన ఐదుగురిలో ఈ నలుగురితో పాటు ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా ఉన్నారు. అమెరికాలోని 19 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉభయ పార్టీలు భారతీయ అమెరికన్లను ప్రచార రంగంతో పాటు ఎన్నికల బరిలోకి దింపాయి. ఈ కాక్సలో డాక్టర్ హీరల్ తిపిర్నేని (52) కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరిజోనాలోని ఆరో కాంగ్రెషనల్ జిల్లా నుంచి బరిలోకి దిగిన ఆమె కడపటి వార్తలందేసరికి రిపబ్లికన్ ప్రత్యర్థి డేవిడ్ ష్వెయ్కెర్ట్పై మంచి ఆధిక్యంలో ఉన్నారు.