ముఖ్య అతిధిగా పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. మొండితోక.అరుణ్ కుమార్
తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండల వైఎస్ఆర్ క్రాంతి పథం, (వెలుగు) కార్యాలయ మీటింగ్ హల్ లో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మేరిగల జ్యోతి అధ్వర్యంలో నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డాక్టర్”మొండితోక.అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు, ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని బోధించారని , ప్రతిఒక్కరూ క్షమాగుణంతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే యావత్ ప్రపంచం సుఖఃశాంతులతో ఉంటుందని అన్నారు. యేసు క్రీస్తు చూపించిన ప్రేమ,దయ,కరుణ, క్షమాగుణం ప్రపంచం మొత్తం ఆమోదించి ప్రతి ఒక్కరు అనుసరించాల్సిన సుగుణాలని, క్రీస్తు మార్గము అందరికీ అనుసరణీయం అని అన్నారు అదేవిధంగా తమ మాతృమూర్తి కస్తాల.మరియమ్మ గారు ప్రభు యేసును ఎంతగానో విశ్వసించి ప్రార్థనలు చేసేవారని ,ఆమె నిత్యం బైబిల్ చదువుతూ దానిలోని సారాంశాన్ని మాకు బోధించేదని ,పేదలకు, ప్రజలకు సేవ చేస్తూ ఎలా జీవించాలో తమకు నేర్పిందని ,తమ తల్లి ఆశయ సాధన కోసమే రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజలకు తోడునీడగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు ,