విజయవాడ రూరల్ తెలుగు తేజం ప్రతినిధి:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ లో నాలుగు దశాబ్దాలు పాటు వివిధ హోదాలలో పనిచేసే ఉత్తమ వ్యవసాయ అధికారిగా రైతాంగానికి విశిష్ట సేవలు అందించిన మండవ కృష్ణారావు(95) విజయవాడకన్నుమూశారు . కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు శివారు నాదెళ్ల వారి పాలెం కు చెందిన మండల కృష్ణారావు విజయవాడ గాయత్రీ నగర్ లో తుది శ్వాస విడిచారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఉత్తమ సేవలు అందించిన ఆయన అనంతపురం జిల్లాలో 18 సంవత్సరాలు పశ్చిమగోదావరి జిల్లాలో 18 సంవత్సరాలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహించి ఆయా జిల్లాల్లో రైతు బంధువులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో రైతులకు ప్రభుత్వం ద్వారా బోర్లు వేయించి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు రాష్ట్రస్థాయి ఉత్తమ వ్యవసాయ శాఖ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం నుంచి అనేకసార్లు అవార్డులు సన్మానాలు అందుకున్నారు. నడకుదురులోనే స్వయంభు పుణ్యక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి ప్రదాత. నూతన ఏడంతస్తుల రాజ గోపురం నిర్మాణ కర్త. ఆయనకు భార్య కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కృష్ణారావు కుమారుడు మండవ రవి హైదరాబాదులో ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు కృష్ణారావు మృతికి గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.