కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న పాపకు 5000/- రూ. సహాయం
తెలుగు తేజం, నందిగామ : కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న పాపకు తన వంతు బాధ్యతగా మానవతా దృక్పథంతో 5000/- రూపాయలు సహాయం పాప తరుపున వారికి అందజేశారు నందిగామ రూరల్ సిఐ సతీష్ కుమార్అం తేకాకుండా లాక్ డౌన్ సమయంలో కూడా లారీ డ్రైవర్ లకు ,దొనబండ క్వారీ ల్లో పనిచేసే కార్మికులకు, బిచ్చగాళ్లుకు నిత్యావసర సరుకులు మరియు ఆహార పోట్లాలను అందజేసి విశేషమైన సేవలను అందించారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతు మానవతా హృదయాన్ని చాటుతున్నా రూరల్ సిఐ సతీష్ కుమార్. ఈ సందర్భంగా సతీష్ కుమార్మా ట్లాడుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని ప్రతి ఒక్కరు సమాజంలో తన బాధ్యత గా పదిమందికి సహాయపడే గుణాన్ని ఏర్పాడుచుకొవలని తెలియజేశారు. జజ్జూరు గ్రామంలో సేవా జాగృతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ కంచికచర్ల చెందిన నవ్య శ్రీ అనే పాప క్యాన్సర్ వల్ల బాధపడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే 55,000/- సహాయం అందజేసిన విషయం తెలిసిందే. కంచికచర్ల పట్టణంలో నవ్య శ్రీ అనే పాప క్యాన్సర్ వల్ల బాధపడుతున్న పాపను హాస్పిటల్ చికిత్స కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని పాప నిరుపేద కుటుంబంలో జన్మించి తండ్రి కూడా లేరని తల్లి రోజు వారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో పాప ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చు భరించే స్తోమత లేక ఎవరైనా దాతలు ఉంటే ఈ ఫోన్ నెంబర్ కు 9000039593 పవన్ కుమార్ కు ఫోన్ చేసి ఆ అభాగ్యురాలు అయిన పాపను అదుకొవలని మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆపాపకు పునర్జన్మ ప్రసాదించవలసినదిగా దాతలను ప్రార్థించడం జరిగింది.