తెలుగుతేజం,వత్సవాయి : మానవత్వం మరిచి పోతున్న ఈరోజుల్లో మానసిక వికలాంగుల తో కలిసి తమ పెళ్లి రోజు జరుపుకోవాలనే ఆలోచన రావటం చాలా గొప్పదని, ఇటువంటి ఆలోచనలు చాలా కొద్దిమందికే వస్తాయని పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. జీవించిన ఒక్కరోజైనా వీరితో కలిసి, వారిలో సంతోషాన్ని నింపాలని , ఆ సంతోషంలో వారి అంధత్వాన్ని మరిచి ఆనందాన్ని కలిగించే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని, పెంట్యల వారి గూడెం గ్రామ సర్పంచ్ వడ్డే. పరమయ్య అన్నారు. మండలంలోని పెంట్యల వారి గూడెం గ్రామ సర్పంచ్ వడ్డే. పరమయ్య పెళ్లి రోజు సందర్భంగా బోనకల్ లోని శాంతి నిలయంలో మానసిక వికలాంగులకు దంపతులు ఇద్దరూ కలిసి సోమవారం ఆహార పదార్థాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని డబ్బా కు పల్లి పిఎసిఎస్ అధ్యక్షులు ,ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేంబెటి. వెంకటేశ్వరరావు, సర్పంచ్. కొట్టే .నాగేశ్వరరావు చేతులమీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వడ్డే. పరామయ్య మాట్లాడుతూ మనకంటే తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, అందరూ ఉంటారు. కానీ ఇటువంటి మానసిక వికలాంగులకు అటువంటి వారు ఎవరూ ఉండరు. కావున మా యొక్క పెళ్లి రోజును వారి సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, వారికి ఒక్క పూట రోజు అన్న దానాన్ని ప్రసాదించటం వల్ల చాలా సంతోషంగా అనిపించిందని , ఇటువంటి వారిని చేరదీసి ఆదరిస్తున్న శాంతి నిలయం సిస్టర్. అల్పీ ,మిగతా వారికి కృతజ్ఞతలు తెలిపారు.