తెలుగు తేజం, మైలవరం : మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం ములపాడు గ్రామంలో నామినేషన్లు వేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిపక్ష టిడిపి కి దశాబ్దాల పాటు కంచు కోట గా కొనసాగుతున్న మూలపాడు గ్రామంలో గతంలో టిడిపి మినహా ఇతర పార్టీల వారు నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఇదే తరహాలో గత కొన్నేళ్లుగా నడుస్తూ వస్తుందంటే అతిసోయొక్తి కాదు అయితే ప్రస్తుత వైసీపీ పాలనలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మెచ్చి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పారదర్శక పాలన నచ్చి ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పంచాయితీ ఎన్నికల లో వైసీపీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు.అందులో భాగంగా అసలు నామినేషన్లు వేయడానికి ముందుకు రాని రోజుల నుండి అనూహ్యంగా ఒకే రోజు 14 వార్డులకు 13 వార్డులకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా మారో అభ్యర్థి మంచి రోజు కోసం రేపు వేయనున్నారు… అయితే అభ్యర్థులు అందరూ మూకుమ్మడి గా ఒకే సారి నామినేషన్లు వేసి ములపాడు పసుపు కోటలో ప్రకంపనలు సృష్టించారు. ఏళ్ల నాటి టిడిపి పాలనలో విసిగి వేసారిన ప్రజలు సైతం వైసీపీ కే మొగ్గు చూపుతున్నారు అనే సంకేతాలు అందడంతో ములపాడు వైసీపీ కేడర్ మంచి జోష్ మీద ఉంది… ఎన్నికల్లో తమ గెలుపు తధ్యమని నామినేషన్ల మొత్తం వేయించడo ద్వారా మూలపాడు లో మొదటి విజయం సాధించామని వైసీపీ నాయకులు నూతనోత్సాహం తో పని చేస్తున్నారు… మూలపాడు గడ్డ పై వైసీపీ జెండా రెప రెపలాడిస్థామనీ ధీమా వ్యక్తం చేస్తున్నారు…