తెలుగు తేజం, మైలవరం : పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో అక్కల రామ్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగినాయి.ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ మహిళలు పాలు పొంగించి ప్రారంభించారు.తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించి భోగి మంటలు వెలిగించి కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాలు 2020 సంవత్సరంలో కారోన బారిన కాలంలో పడినటువంటి బాధలను పారద్రోలి కొత్త సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వెలుగొందాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు , అలాగే మండల పార్టీ నాయకులు చెరుకుమల్లి సురేష్, శ్రీకాంత్ గారు,ఉదయ్ గారు,బ్రహ్మయ్య ,రమేష్, రాయుడు, రమేష్ , సతీష్ , మురళి కృష్ణ , మహిళలు లక్ష్మీ , కాంతారావు , నరసింహారావు , ఎర్రంశెట్టి నాని,బండి వంశీ, శివ, కోలా రాజు , ప్రవీణ్ ,రమేష్ ,ఆదినారాయణ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.