తెలుగు తేజం, కంచికచర్ల : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో (ఎంపిడిఓ) పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు మండల వైసిపి అధికార ప్రతినిధి మార్తా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సోమవారం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయడం అభినందనీయమని, జగనన్న పిలుపుమేరకు ప్రతిఒక్కరూ రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారమవుతమని, రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరోక ప్రాణాన్ని కాపాడవచ్చున్ని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చెపట్టాలని నాయకులు కార్యకర్తలు అభిమానులు పిలుపునిచ్చారు.
కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్ రైజ్ హాస్పటల్ జగదీష్, డాక్టర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ విజయవాడ గోపికృష్ణ వారు సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, అధికార ప్రతినిధి మార్తా శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వైసిపి నాయకులు మార్తా శ్రీనివాసరావు, అబ్బూరి నాగమల్లేశ్వరరావు,కలతోటి అజేయ్ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరం లో పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు మార్తా శ్రీనివాసరావు అబ్బురి నాగమల్లేశ్వరావు, కాలవ పెద్ద బాబు నన్నపనేని నరసింహారావు,మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, పరిటాల రాము బండారు పల్లి శబరి మంగళంపూడి కోటి బాబు మంగళంపూడి సన్నీ,శేషం అనిల్, గొర్రెపాటి రాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.