తెలుగు తేజం, కానూరు : గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు దేశం పార్టీ నాయకులూ అనుమోలు ప్రభాకర్ ఆధ్వరంలో పోరంకి, కానూరు గ్రామా పరిధిలో పలుచోట్ల జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కామయ్యతోపులోని అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత, బహుజన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన మహాను బావులు భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేత్కర్ అని తెలిపారు. ఆలాంటి రాజ్యాంగ స్ఫూర్తికి కొందరు స్వార్ధ రాజకీయ నేతలు తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని అనుకున్నారని కానీ సుప్రీం కోర్టు తీర్పుతో అవి పటాపంచలు అయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాజ్యంగా స్ఫూర్తిని కాపాడుతూ తెలుగు దేశం పార్టీ విజయానికి ప్రతి కార్య కర్త కృషి చేయాలనీ ఆయన పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మాజీ ఎం పీ టి సి నాగలక్ష్మి తో పాటు పలువురు నాయకులూ, కార్య కర్తలు పాల్గొన్నారు.