తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల విశాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంనందు జరిగిన సమావేశములో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కంచికచర్లు వారి 2021 సంత్సరమునకు వార్షిక క్యాలండరు కంచికచర్ల సబ్ ట్రెజరీ అధికారిణి శ్రీమతి శ్రీ లక్ష్మీ అవిష్కరించారు . ఆమె మాట్లాడుతూ సంఘంతరపున క్యాలండర్ వేయడం మంచి విషయం అని , దానిలో పెన్షనర్లకు ఉపయోగపడే విషయాలు ఉండాలన్నారు. అధ్యక్షులు సానే రామమోహనరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది నుండి వేసే క్యాలండరులో పెన్షనర్లకు సంబందించిన పూర్తి వివరాలు ప్రచురిస్తామన్నారు . ఈ సమావేశములో కార్యదర్శి ముండ్లపాటి పోతురాజు , ట్రెజరర్ చలసాని నాగేశ్వరరావు , పెద్దినీడి కోటేశ్వరరావు, బొల్లం కృష్ణమూర్తి, వసంత బాబు, సర్వేశ్వరరావు,ఖాజా, మల్లికార్జున రావు, గోపాల కృష్ణ పాల్గొన్నారు.