తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో అమరులైన రైతులకు నివాళ్ళు అర్పించిన సిఐటియు , రైతు , ప్రజా సంఘాలు.రైతు అమర వీరులకు శ్రద్ధాంజలి. ఉద్యమంలో 33 రైతులు మృతి,లక్షకు పైగా గ్రామాల్లో నివాళిలకు పిలుపు . రైతు ఉద్యమంలో అమరులైన 33 మంది రైతు వీరులకు నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించాలని అఖిల భారత కిసాన్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపు ఇచ్చింది. అందులో భాగంగానే లక్షకు పైగా గ్రామాల్లో అమరవీరులైన రైతులకు నివాళులర్పించేందుకు సిద్ధమైయ్యారు. చలి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రమాదాలు, అనారోగ్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నవంబర్ 26 రైతు పోరాటంలో పాల్గొన్న 33 మంది రైతులు అరులైయ్యారు. ఈ రైతు యోధుల అత్యున్నత త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, యోధుల ఫోటోలను పూల మాలలేసి నివాళులర్పించనున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నివాళుర్పించాలని ఎఐకెఎస్ పిలుపు నిచ్చింది. కార్పొరేట్ అనుకూల వాదనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, పోరాటం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో విస్తృతంగా మరింత తీవ్రతరం చేస్తామని ఎఐకెఎస్ స్పష్టం చేసింది. ఈ అమరవీరుల త్యాగాల స్ఫర్తితో రైతుల నిజమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతోందని అన్నారు.
మృతి చెందిన రైతుల పేర్లు, బాబా రామ్ సింగ్ (కర్నాల్), మాఖన్ ఖాన్ (మోగా),లాబ్ సింగ్ ,కుళ్విందర్ సింగ్ , గుర్ప్రీత్ సింగ్ ,గుర్విన్దర్ సింగ్ ,
అజయ్ కుమార్ (సోనిపథ్), ధన్నా సింగ్ (చేహన్వాలి), గజ్జన్ సింగ్ (లూథియానా),గుర్జన్ సింగ్ (మాన్సా),కృష్ణ లాల్ (ధూరీ) కితాబ్ సింగ్ (జింద్)
లఖ్వీర్ సింగ్ (బథిండా) సురిందర్ సింగ్ (నవా షెహర్) మేవా సింగ్ (మోగా) రామ్ మెహర్ గుర్బచ్చన్ సింగ్ (మోగా), గుర్మేల్ కౌర్ (బథిండా), బల్ బీర్ సింగ్ (అమ్రిత్సర్), భాగ్ సింగ్ (బాదోవాల్), గురుదేవ సింగ్ (అత్తార్ సింగ్ వాలా), జై సింగ్ (భుచో), జాతిందర్ సింగ్ (ఫత్తా మలుకా), గుర్ప్రీత్ సింగ్ (అంబాలా), భీమ్ సింగ్ , జనక్ రాజ్ (బర్నాలా), కాహన్ సింగ్ (బర్నాలా), రణధీర్ సింగ్ (హుస్సేన్ పురా), హజూరా సింగ్ (పాటియాలా)
ఈ కార్యక్రమంలో సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎ.విఠల్ రావు , సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ , యూనియన్ నాయకులు రామరావు , శ్రీను , లైలా , రమణ , అంజలి తదితరులు పాల్గొన్నారు.