వీరులపాడు మండల టిడిపి అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్
తెలుగు తేజం, రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు తొలగించే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలు పెట్టిందని, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం నిరుపేద కుటుంబం యొక్క కార్డులు తొలగించాలని ఈ ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారని వీరులపాడు మండల టిడిపి అధ్యక్షులు కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు వ్యవసాయ పొలం, ఆదాయపన్ను, కరెంటు మీటర్లు ఇలా ఎన్నెన్నో సాకులు చెప్పి నిరుపేద కుటుంబంలో రేషన్ కార్డులు తొలగించడం జరుగుతోందని, చేతగాని ప్రభుత్వం చేతగాని సంక్షేమ పథకాలు పెట్టి అమాయక ప్రజలను బలి చేస్తోందని, రోజువారి కూలీలు, వ్యవసాయ కూలీలు ఇలా ఎంతో మందికి నిరు పేద ప్రజలకు రేషన్ కార్డులు తొలగిస్తున్నారని, అందులో భాగంగానే ఇటీవలి కాలంలో 9 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసారని స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే మిగిలిన వాటిని కూడా రద్దు చేస్తారని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై అమిత భారం మోపారని. ధరల పెంపుతో రాష్ట్రంలో పేదలపై ఏడాదికి రూ.580 కోట్ల భారం పడుతోందన్నారు. బూతుల మంత్రి కొడాలి నానికి, కోతల సీఎం జగన్‌రెడ్డికి పేదల బాధలు పట్టడం లేదని కొండ్రగుంట శ్రీనివాస్ కుమార్ విమర్శించారు. వీరులపాడు మండలం లో. ఏఒక్క తెల్ల రేషన్ కార్డును రద్దు చేసిన సరే జగన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. ఇప్పటికైనా పేద ప్రజలకు ఈ చేతగాని ముఖ్యమంత్రి మంచి చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.