తెలుగు తేజం, గుంటూరు: వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి హల్చల్ చేశారు. కాజా టల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ఫీజు చెల్లించాలన్న సిబ్బందిపై చేయిచేసుకున్నారు. నన్నే టోల్ చెల్లించాలని చెబుతావా అంటూ సిబ్బందిపై పరుషపదజాలం ఉపయోగించారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్గేట్ సిబ్బంది బారికేడ్లు అడ్డుపెట్టారు. కోపంతో కారు దిగి ఆమె హల్చల్ చేశారు. తన కారు ఆపుతారా అంటూ సిబ్బందిపై దాడి దిగారు. అంతేకాదు రేవతి బారికేడ్లను తోసేశారు. రేవతి హడావిడితో టోల్గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తీసుకొని విజయవాడ వెళ్లిపోయారు.