తెలుగు తేజం వత్సవాయి : మండలములోని భారతీయ జనతా పార్టీ వత్సవాయి మండల పార్టీ కోశాధికారి మన్నే నాగబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన
2014వ సంవత్సరం నుంచి మంగోల్లు గ్రామ శాఖ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతం మండల భారతీయ జనతా పార్టీ కోశాధికారిగా పనిచేస్తూ తన తుది శ్వాస విడిచారు. ఆనాడు భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా చేరినప్పటి నుండి మంగోల్లు గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినను ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ధైర్యం చెప్తూ పంచాయతీ ఆఫీస్ లో గాని, రెవెన్యూ కార్యాలయంలో గాని, పోలీస్ స్టేషన్లో గాని, ఇతర ఏ ప్రభుత్వ ఆఫీస్ లో నైన, పనులను నిస్వార్ధంగా చేయించేవారు. గ్రామంలో ధనిక పేద అనే తేడా లేకుండా ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తిన ను వారి సమస్య పరిష్కారం అయ్యేవరకు వారి వెంట ఉంటూ పనులు పూర్తి చేయించేవారు.
పార్టీ కార్యక్రమాలు ఏమున్నా అందరికంటే ముందు ఉంటూ ఈ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు సొంత పనిలాగా చేసుకుంటూ వెళ్లేవారు. పార్టీలో ఆశాజ్యోతిలాగా మెలిగేవారు. ప్రతినిత్యం పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసేవారు. పార్టీలో ఒక కీలకమైన వ్యక్తి గా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న మహానుభావుడు. అటువంటి వ్యక్తి ఇటు ప్రజల మధ్య పార్టీకి దూరమై పోవటం గ్రామ ప్రజలుకు, పార్టీకి తీరని లోటు! ఈ విషయం విన్న కుటుంబీకులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి పార్థివ దేహాన్ని, కుటుంబ సభ్యులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు.