విజయవాడ : ఆసియాలోనే అతిపెద్ద విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్ పైకి పార్కింగ్ కోసం వస్తున్న ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు.. ఉన్నట్టుండి ఫ్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పలువురు ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో చిన్నారి, కండక్టర్ తోపాటు మరోకరు మరణించారు.
లగ్జరీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే.. ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుందని చెబుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.