పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్మన్ కలిసిన జిల్లా సంఘం నాయుకులు
తెలుగు తేజం, నరసన్నపేట : పోలినాటి వెలమ సంక్షేమానికి అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగుదామని పోలినాటి వెలమ కార్పోరేషన్ చైర్మన్ పంగ కృష్ణవేణి బావాజీ నాయుడు అన్నారు. బుధవారం ఉదయం నరసన్నపేట మండలం నరసింగపల్లి గ్రామంలో ఆమె స్వగృహంలో పోలినాటి వెలమ సంక్షేమ సంఘం నాయకులు ఆమెను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలినాటి వెలమ సామాజిక వర్గం జిల్లా అధ్యక్షులు ధర్మాన రఘునాథరావు పలు సమస్యలను కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా కేంద్రంలో పోలినాటి వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేయాలని అలాగే ప్రతి మండల కేంద్రంలో వెలమ సంక్షేమ సంఘ భవనాలు నిర్మించాలన ఆమె దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా గా ఆమె మాట్లాడుతూ పోలినాటి వెలమ సామాజిక వర్గం సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె చెప్పారు అలాగే గే జిల్లా సంఘం వారు తెలియజేసిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లో శ్రీకాకుళం జిల్లా పోలినాటి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధర్మాన రఘునాథరావు ప్రధాన కార్యదర్శి దుండగుల పార్థసారథి కోశాధికారి నక్క శంకర్రావు ఉపాధ్యక్షులు గుండ మోహన్ రావు పొన్నాన సీతారాం నాయుడు ప్రతినిధులు పొన్నా నా జై రామ్ నరసన్నపేట వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుండ స్వామి బాబు తదితరులు పాల్గొన్నారు