జగ్గయ్యపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని క్రిస్టియన్ పేట లో గల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని, ఆయన సమాన హక్కులు కల్పించే విధంగా కృషి చేసిన ఘనత ఒక్క బీఆర్ అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.