తెలుగు తేజం, విజయవాడ : బ్రాహ్మణవీధిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం రధసప్తమి ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రధసప్తమిని పురస్కరించుకొని స్వామివారు ఉభయదేవరులతో కలిసి ఏడు వాహనాల్లో ఊరేగారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే విధంగా శ్రీవారు వన్‌టౌన్‌లోని ఆలయంలోనూ ఏడు వాహనాలను అధిరోహించి భక్తులను కనువిందు చేశారు. ఉదయం భూసమేత వెంకటేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామిని తొలిగా సూర్యప్రభ వాహనంపై అధిష్టింపజేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామిని ఊరేగించారు. అనంతరం శేషవాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అలాగే హనుమత్ వాహనాన్ని స్వామి వారు అధిరోహించి భక్తులకు నయనానందాన్ని కలిగించారు. అదేవిధంగా స్వామి వారికి ప్రీతికరమైన గరుడవాహనాన్ని ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ స్వామి వారిని ఊరేగించారు. అలాగే గజ, పుల్ల పల్లకీ వాహనాలపైనా స్వామి వారు ఊరేగుతూ భక్తులను పులకింపజేశారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారు ఊరేగారు. స్వామి వారికి రాత్రి ఆలయ ప్రాంగణంలో శాంతి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం అంతరాలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకారం చేశారు. వైధిక కార్యక్రమాలను ఆలయ అర్ఛకస్వాములు పీ.రామచంద్రమూర్తి (రాము), పరాశరం మురళీకృష్ణమాచార్యులులు పర్యవేక్షించారు. రధసప్తమిని పురస్కరించుకొని వెంకటేశ్వరస్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఛైర్మన్ గుడిపాటి పాపారావు కార్యనిర్వహణాధికారి గెల్లి హరిగోపీనా«ద్‌బాబు పర్యవేక్షించారు. కమిటీ సభ్యులు గర్రె సురేష్, బ్రమరాంబ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.