తెలుగు తేజం, విజయవాడ : కార్తీకమాసం మొదటి సోమవారం భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక దీపారాధన కోసం పెద్ద సంఖ్యలో భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివుని దర్షించుకునేందుకు అభిషేకాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ కారణంగా ఘాట్‌లలో స్నానం చేయడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు.